![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -465 లో...వల్లికి కడుపు లేదన్న విషయం వల్లీతో డాక్టర్ చెప్తుంది. దాంతో వల్లి షాక్ అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి డాక్టర్.. నా కాపురం చెడిపోకుండా కాపాడండి అని వల్లి డాక్టర్ ని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో వేరే వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్స్ వల్లికి ఇచ్చి మీ తోడికోడళ్ళకి చూపించు కానీ ఇంకొకసారి నా దగ్గరికి రాకు అని డాక్టర్ వార్నింగ్ ఇస్తుంది. దాంతో వల్లి రిపోర్ట్స్ తీసుకొని వెళ్లి నర్మద వాళ్ళకి ఇస్తుంది. నువ్వు ప్రెగ్నెంట్ అక్క కానీ మీ అమ్మ అలా కూర చేసి పంపేసరికి డౌట్ వచ్చిందని ప్రేమ అంటుంది. సరే మీరు ఈ రిపోర్ట్ పట్టుకొని ఇంటికి వెళ్ళండి.. నాకు చిన్న పని ఉంది అని వాళ్ళని పంపిస్తుంది వల్లి.
ఆ తర్వాత నర్మద, ప్రేమ నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఎలా బ్యాంకుకి వెళ్ళాలి అక్కకి ఏమని చెప్పాలని ప్రేమ టెన్షన్ పడుతుంది. అక్క మా ఫ్రెండ్ ని కలిసి వస్తానని ప్రేమ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు వల్లి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ నాకు ఇప్పుడు ఎన్నో నెల.. ఎవరు పుడతారని అడుగుతుంది.. నీకు మూడో నెల కవలలు పుడతారని భాగ్యం చెప్పగానే భాగ్యం చెంపచెల్లుమనిపిస్తుంది వల్లి. నాకు లేని కడుపుని ఉన్నట్టు చెప్పి నా కొంపముంచావ్.. ఇప్పుడు వాళ్ళకి నిజం తెలిస్తే నా కాపురం కూలిపోతుందని వల్లి ఏడుస్తుంది. అంత దాకా రాదు నువ్వు నిజం గానే ప్రెగ్నెంట్ అవ్వు.. ఆ ప్రయత్నం చెయ్ అని భాగ్యం చెప్తుంది.
మరొకవైపు ప్రేమ బ్యాంకుకి వెళ్తుంది. సేనాపతి, భద్రవతిని రప్పిస్తాడు మేనేజర్. వాళ్ళని చూసి ప్రేమ షాక్ అవుతుంది. నిన్ను ఆ రామరాజు ఇలా చెయ్యమన్నాడా అని కోప్పడతారు. లేదు నాన్న నాకు అవసరం ఉండి ఇలా చేసానని ప్రేమ అంటుంది. ప్రేమని తీసుకొని రామరాజు ఇంటికి గొడవకి బయల్దేరతారు సేనాపతి, భద్రవతి . మరొకవైపు నర్మద తీసుకొని వెళ్లిన రిపోర్ట్ చూసి రామరాజు వాళ్ళు అది చూసి మురిసిపోతారు. అప్పుడే వల్లీ డల్ గా లోపలికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |